- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి..
ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, నిజాంపేట : ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చల్మెడ గ్రామానికి చెందిన రెడ్డి కరుణాకర్ (28) అను వ్యక్తి తండ్రి ఎల్లయ్యతో కలసి తమకున్న పంట పొలానికి యూరియా మందు చల్లిన తరువాత కర్ణాకర్ కాలు, చేతులు శుభ్రం చేసుకోవడానికి దగ్గర్లో ఉన్న బ్రాహ్మణ చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఊపిరాడక మృతి చెందాడు.
ఎంతసేపటికీ తన కొడుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి చుట్టూపక్కల వెతుకుతూ చెరువు దగ్గరకు వెళ్లి చూడగా చెప్పులు, బట్టలు కనపడడంతో ఇరుగుపొరుగు వారికి ఫోన్ ద్వారా తెలపగా చెరువులో వెతికారు. కరుణాకర్ చనిపోయి శవమై కనిపించాడు. తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో కలివిడిగా ఉండే కరుణాకర్ మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.






