- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో సంచలనం.. ఇంటికి దెయ్యం పట్టిందని దారుణం
by GSrikanth |
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఫిల్మ్ నగర్లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఫిల్మ్ నగర్లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కొందరు గుర్తుతెలియని దుండగులు వ్యూహాత్మకంగా ఇంటికి దెయ్యం పట్టిందని ఓ అమాయక మహిళను నమ్మించారు. పూజలతో దెయ్యాన్ని వదిలిస్తామని సదరు మహిళ నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేశారు. ఇంట్లో ఉన్న బంగారమంతా ఆ పూజలో పెట్టాలని ఆమెకు చెప్పారు. పూజ అనంతరం ఆమె కళ్లు గప్పి రూ.లక్ష నగదు.. 10 తులాల బంగారంతో దుండగులు పరారయ్యారు. మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ తతంగం స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






