fisherman died : చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

by Sridhar Babu |   (  Updated:2024-07-28 10:06:04  IST  )

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

fisherman died : చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
X

దిశ, కమలాపూర్ : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన మౌటం రాజేష్ (26) వృత్తిరీత్యా ఉదయం కమలాపూర్ లోని పెద్ద చెరువులోకి చేపల వేటకు వెళ్లి చేపలు పట్టేందుకు వేసిన వల కాళ్లకు చుట్టుకోగా నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి మత్స్యకారులైన బండి రాంబాబు, బండి రమేష్ లు రాజేష్ ను నీటిలో నుండి బయటకు తీసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా రాజేష్ మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. మృతునికి భార్య , కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Next Story