Accident : బైక్ ను ఢీకొన్న కారు…వ్యక్తి మృతి

by Taduka Kalyani |   (  Updated:2024-09-06 14:15:15  IST  )

కారు బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని జగన్ నాయక్ తండా స్వామి నారాయణ గురుకుల స్కూల్ వద్ద చోటు చేసుకుంది.

Accident : బైక్ ను ఢీకొన్న కారు…వ్యక్తి మృతి
X

దిశ, చివ్వేంల : కారు బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని జగన్ నాయక్ తండా స్వామి నారాయణ గురుకుల స్కూల్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆత్మకూరు ఎస్, మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన కుంచం పాపయ్య, కోదాడ వైపు నుండి సూర్యాపేటకు తన బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తమ్ముడు సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Next Story