- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబాలా జిల్లాలోని పలు షాపులకు కల్తీ మద్యం సరఫరా కాగా తాగిన 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ నేత, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత కుమారుడితో పాటు మరో ఐదుగురు ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కల్తీ మద్యాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఫైర్ అయ్యాయి.
Next Story






