పండుగపూట ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం

by Gantepaka Srikanth |

ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాన్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు బలంగా ఢీకొట్టింది.

పండుగపూట ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాన్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం గాయాలైన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Next Story