- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Youtuber: షాకింగ్ న్యూస్.. యూట్యూబర్ అనుమానాస్పద మృతి
అనుమానాస్పద స్థితిలో ప్రముఖ యూట్యూబర్ (Youtuber) మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా (NTR District)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అనుమానాస్పద స్థితిలో ప్రముఖ యూట్యూబర్ (Youtuber) మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా (NTR District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విస్సన్నపేట (Vissannapet) మండల పరిధిలోని ఏ కొండూరు (A Kondur) గ్రామానికి చెందిన మధుమతి (Madhumathi) (22) సోషల్ మీడియా (Social Media)లో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్ చేస్తూ తనకుంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. అదేవిధంగా లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఆమె సొంతం. ఈ క్రమంలోనే మధుమతి (Madhumathi)కి అప్పటికే వివాహం అయిన ప్రతాప్ (Prathap)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారి తీసింది. అయితే, ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో తమ కుమార్తెను ప్రతాపే వెంట తీసుకెళ్లి ఎవరికి అనుమానం రాకుండా ఉరేసి చంపేశాడని, అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






