- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ రైల్వే సేఫ్ కాదు.. లేడీ యూట్యూబర్ సంచలన ఆరోపణలు
ఇండియన్ రైల్వే అంత సేఫ్ కాదు అంటూ ఓ యూట్యూబర్ సంచలన ఆరోపణలు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ రైల్వే అంత సేఫ్ కాదు అంటూ ఓ యూట్యూబర్ సంచలన ఆరోపణలు చేసింది. ట్రావెల్ వ్లాగర్ కనికా దేవ్రానీ తనకు ట్రైన్‌లో మత్తు మందు ఇచ్చి డబ్బు దోచుకున్నారని చెప్పారు. ఢిల్లీ నుండి గౌహతికి ప్రయాస్తున్న సమయంలో బ్రహ్మపుత్ర మెయిల్ లోని సెకండ్ ఏసీ కోచ్‌లో తాను ఎక్కానని తెలిపింది. పశ్చిమబెంగాల్‌లోని న్యూ జలైప్‌గురి జంక్షన్ ర్వేల్వే స్టేషన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ సంఘటన జరిగిందని చెప్పింది. తన తోటి ప్రయాణికులు కూడా దోపిడీకి గురయ్యారని తెలిపింది.
ఓ ప్రయాణికుడు సీట్ నంబర్ గురించి అడిగాడని తాను మాట్లాడుతున్న సమయంలో తనపై ఏదో స్ప్రే చల్లాడని చెప్పింది. తరవాత తనకు ఏమీ అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను లేచిన తరవాత చూస్తే తన ఐఫోన్ ప్రో మాక్స్ పోయిందని చెప్పింది. ఫోన్ దిండు కింద ఉన్నా కూడా ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ స్టాలో వీడియో పెట్టిన కనికా తన వీడియోకు రైల్వే పోలీసులను ట్యాగ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఫోన్ లైవ్ లొకేషన్ చెప్పినప్పటికీ రైల్వే ప్రెటెక్షన్ ఫోర్స్ తనకు సహాయం చేయలేదని ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కనినా వీడియో వైరల్ అవుతోంది. వీడియో






