- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం
by Taduka Kalyani |
దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది.

X
దిశ, దోమ: దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. స్థానికుల వివరాల ప్రకారం, గుణిగారి గాలమ్మ, రామయ్య దంపతుల కుమారుడు వెంకటేశ్ తన ఇంట్లో మృతిచెందినట్లు తెలిపారు. ఘటన స్థలంలో లభించిన లేఖలో, "నన్ను ఎవరూ ఏం అనలేదు. నాకు ఈ బతుకు బతకాలనిపించడం లేదు. అమ్మ జాగ్రత్త" అని రాసి ఉన్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం వెంకటేశ్ తండ్రి రామయ్య మృతి చెందగా, దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Next Story






