ఆన్ లైన్ గేమ్స్ తో యువ‌కుడు బ‌లి

by Nallavelli.Anjaneyulu |

ఆన్ లైన్ గేమ్ లు ఆడొద్దని ప్రభుత్వాలు, సామాజిక వేత్తలు ఎన్ని చెప్పినా యువకులు ఆన్ లైన్ గేమ్స్ ఆగటం లేదు.

ఆన్ లైన్ గేమ్స్ తో యువ‌కుడు బ‌లి
X

దిశ, గోదావరిఖని : ఆన్ లైన్ గేమ్ లు ఆడొద్దని ప్రభుత్వాలు, సామాజిక వేత్తలు ఎన్ని చెప్పినా యువకులు ఆన్ లైన్ గేమ్స్ ఆగటం లేదు. గోదావరిఖని విఠ‌ల్ నగర్ కు చెందిన తుండ్ల రోహిత్ (25) యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో ఆన్ లైన్ గేమ్స్ కి అలవాటు పడి అప్పుల పాల‌య్యాడు. బుధవారం గోదావరిఖని వన్ టౌన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిని అప్పులు తీర్చేందుకు డబ్బులు కావాలని అడగ్గా.. ఆమె దాదాపు 5 లక్షల రూపాయల వరకు మృతునికి ఇచ్చిందని తెలిపారు. గతంలో రెండు, మూడు సార్లు అప్పులు ఎక్కువగా ఉన్నాయని.. నేను చనిపోతాను అనేవాడని పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది చీరతో ఇంటి పై కప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడాని తెలిపారు. తెల్లవారుజామున ఇంటి తలుపులు కొట్టగా మృతుడు తలుపులు తెరవకపోయేసరికి ఇంటి ప్రక్కవారైనా గడ్డం సురేష్ సహాయంతో తలుపులు తెరిచి చూడగా మృతుడు ఉరికి వేలాడుతూ చనిపోయి ఉన్నాడు అని తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ సంజీవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story