- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల భారం తాళలేక యువకుడి ఆత్మహత్య
జల్సాలకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు చివరకు మానసిక ఒత్తిడికి లోనై బలవంతం చేసుకున్నాడు. ఈ ఘటన ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

దిశ, జమ్మికుంట టౌన్ : జల్సాలకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు చివరకు మానసిక ఒత్తిడికి లోనై బలవంతం చేసుకున్నాడు. ఈ ఘటన ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న గుత్తికొండ అఖిలేష్ (22), బీటెక్ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం లేక ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, అఖిలేష్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే జల్సాలకు అలవాటుపడి, కాలేజ్‌కి సరిగ్గా హాజరుకాలేదని తెలిపారు. అప్పట్లోనే స్నేహితుల వద్ద ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసేవాడు.
వాటిని తల్లితండ్రులే తీర్చినప్పటికీ, మళ్లీ వారి మాట వినకుండా మరోసారి అప్పుల పాలయ్యాడు. ఈసారి స్నేహితుల వద్దే కాకుండా, వివిధ లోన్ యాప్స్ ద్వారా కూడా డబ్బులు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించేందుకు మార్గం లేక, ఒత్తిడికి గురైన అఖిలేష్ గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంలో మృతుడి తండ్రి గుత్తికొండ రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






