- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్వాన్ లో యువకుడి దారుణ హత్య
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ నగర్‌లో సోఫా మేకర్ అయిన యువకుడు మొహమ్మద్ ఖబులా అలియాస్ అడ్డు ఖాన్ దారుణ

దిశ, కార్వాన్: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ నగర్‌లో సోఫా మేకర్ అయిన యువకుడు మొహమ్మద్ ఖబులా అలియాస్ అడ్డు ఖాన్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, శనివారం రాత్రి రాహుత్ హోటల్ సమీపంలోని ఓ సంధిలో ఖబులా తన స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన గుర్తు తెలియని కొంతమంది యువకులు ఖబులా తలపై బండరాయితో విరుచుకుపడి తీవ్రంగా గాయపర్చారు. సంఘటనా స్థలంలోనే అతడు మృతిచెందగా, నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
వార్త తెలిసిన వెంటనే ఆసిఫ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు గల మోటీవ్‌పై పరిశీలన చేపట్టారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సంఘటనపై ఆసిఫ్ నగర్ ఎస్‌హెచ్‌ఓ , ఏసీపీ కూడా పరిశీలన చేశారు.






