- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శవానికి శవం సమాధానం కావాల్సిందే.. చనిపోయిన యువకుడి తల్లి డిమాండ్
ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో యువకుడి హత్య సంచలనంగా మారింది. ఓ కమ్యూనిటీకి చెందిన కొంత మంది యువకులు అహేరియా సామాజిక వర్గానికి చెందిన యువకుడిని హత్య చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనలు వెల్లువెత్తాయి. జాతీయ రహదారిని దిగ్బంధించారు

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో యువకుడి హత్య సంచలనంగా మారింది. ఓ కమ్యూనిటీకి చెందిన కొంత మంది యువకులు అహేరియా సామాజిక వర్గానికి చెందిన యువకుడిని హత్య చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనలు వెల్లువెత్తాయి. జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
జవాన్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పందొమ్మిదేళ్ల యువకుడు కరణ్ నోయిడాలో కూలీ పనికి వెళ్లొచ్చాక.. రాత్రి సమయంలో ఓ యువకుడు వచ్చి బయటకు తీసుకెళ్లాడు. కొంత మందితో కలిసి చంపి.. మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఉద్రిక్తత నెలకొంది. అహేరియా సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహంతో నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న సీవో పోలీసు బలగాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆందోళన తెలుపుతున్న జనాన్ని శాంతింపజేసి.. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో యువకుడి తల్లి శవానికి శవం జవాబు కావాలని డిమాండ్ చేసింది.






