- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడిన కాబులా హత్య కేసు మిస్టరీ.. పాత కక్షల నేపథ్యంలో..
ఓ యువకుడి హత్య కేసులో ఇద్దరిని రిమాండ్ కు తరలించిన సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ,కార్వాన్ : ఓ యువకుడి హత్య కేసులో ఇద్దరిని రిమాండ్ కు తరలించిన సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ కుమార్ వివరాలను విలేకరులకు వెల్లడించారు... ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాబులా(22) సోఫా మేకర్. ఇతని మిత్రులు అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ వసీం, సమీర్ ఖాన్ లు పాత కక్షలు నేపథ్యంలో ఆదివారం రాత్రి కాబులా ను హతమార్చేందుకు పన్నాగం పన్నారు. అయితే ఆదివారం రాత్రి మద్యం సేవించిన కాబులా ను వసీం, సమీర్ ఖాన్ లు కత్తితో పొడిచి బండరాయితో మోది హత్య చేసి పారిపోయారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆధ్వర్యంలో నిందితులను ఇద్దరిని పట్టుకొని మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. మహమ్మద్ వసీం కు గతంలో నేర నేపథ్యం ఉందని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇన్స్పెక్టర్ ఆనంద్, డిఐ సంతోష్ కుమార్ లు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద కత్తి పల్సర్ వాహనంతో పాటు మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రిమాండ్ కు తరలించినట్టు ఏసిపి తెలిపారు.






