- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 50 కోసం హత్య.. సంచలనం రేపుతున్న ఘటన
జార్ఖండ్ గిరిదిహ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బెంగాబాద్ పీఎస్ పరిధిలోని ముందర్దిహ్ సమీపంలో యాభై రూపాయల కోసం ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మక్సూద్ అన్సారీ, అనుల్ అన్సారీ ఇద్దరు స్నేహితులు. అనుల్..

దిశ, వెబ్ డెస్క్ : జార్ఖండ్ గిరిదిహ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బెంగాబాద్ పీఎస్ పరిధిలోని ముందర్దిహ్ సమీపంలో యాభై రూపాయల కోసం ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మక్సూద్ అన్సారీ, అనుల్ అన్సారీ ఇద్దరు స్నేహితులు. అనుల్.. మక్సూద్ దగ్గర రూ. 200 అప్పు తీసుకున్నాడు. కానీ చెల్లించేటప్పుడు రూ. 150 మాత్రమే ఇచ్చాడు. మిగతా 50 రూపాయల కోసం జరిగిన వాగ్వాదం కాస్త రక్తపాతంగా మారింది. ఆగ్రహంతో మక్సూద్.. అనుల్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అనుల్ మృతి చెందగా.. మక్సూద్ అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా.. గిరిహిద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు. సదర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి నేతృత్వంలోని సిట్ బృందం హత్య కేసులో నిందితుడైన మక్సూద్ అన్సారీని టెక్నాలజీ సహాయంతో అష్గాండో అడవిలో అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు ఈ హత్యలో ఇతరుల ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.






