- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడంగ్పేట్ లో యువకుడు అదృశ్యం
by Batti.Sumithra |
ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళొస్తానని ఇంటి నుంచి బైక్ పై వెళ్ళిన యువకుడు కనిపించకుండా పోయిన ఘటన పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, బడంగ్పేట్ : ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళొస్తానని ఇంటి నుంచి బైక్ పై వెళ్ళిన యువకుడు కనిపించకుండా పోయిన ఘటన పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పహాడిషరీఫ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన గడ్డి కొండల్ కుమారుడు గడ్డి కార్తీక్ (23) ఈ నెల 14వ తేదీన మన్నెగూడలోని ఆర్టీఓ ఆఫీసుకు వెళ్ళొస్తానని తమ్ముడు గడ్డి కిషోర్‌కు చెప్పి పల్సర్ బైక్‌పై వెళ్లాడు.
ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అతని ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో తండ్రి పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






