- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డివైడర్ ఢీకొని యువకుడు మృతి
by Taduka Kalyani |
బైక్ పై అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గుమ్మడిదల పీఎస్ పరిధిలోని అన్నారం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది.

X
దిశ,జిన్నారం: బైక్ పై అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గుమ్మడిదల పీఎస్ పరిధిలోని అన్నారం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన తాటిచెట్ల రవి(22) అనే యువకుడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. కాగా ఆదివారం స్వంత గ్రామం బీర్కూర్ గ్రామానికి తన స్వంత బైక్ పై బయలుదేరగా గుమ్మడిదల మున్సిపల్ అన్నారం గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్ ని అతి వేగంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






