- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
by Sridhar Babu |
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి దీపక్ నగర్ కు చెందిన కుదురుకోట నవీన్ (30) అనే యువకుడు తన నివాసంలో ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ,మందమర్రి : మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి దీపక్ నగర్ కు చెందిన కుదురుకోట నవీన్ (30) అనే యువకుడు తన నివాసంలో ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం...మృతుడు నవీన్ వృత్తి రీత్యా గృహాలకు టైల్స్ వేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో గత 9 నెలల క్రితం రెండు చేతి వేళ్లు ప్రమాదానికి గురయ్యాయి.
దీనికి తోడు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దాంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి ముగ్గురు సోదరులు, పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి ఉన్నట్లు సమాచారం.
- Tags
- suicide
Next Story






