ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, కౌడిపల్లి : ఉరేసుకొని యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న కౌడిప‌ల్లి ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ముర‌ళి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండల కేంద్రమైన కౌడిపల్లికి చెందిన చంద్రం ప్రవీణ్ గౌడ్ (39) ఓ ప్రైవేట్ పరిశ్రమ బస్సు

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
X

దిశ, కౌడిపల్లి : ఉరేసుకొని యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న కౌడిప‌ల్లి ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ముర‌ళి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండల కేంద్రమైన కౌడిపల్లికి చెందిన చంద్రం ప్రవీణ్ గౌడ్ (39) ఓ ప్రైవేట్ పరిశ్రమ బస్సు డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. కంపెనీ యాజమాన్యం ప్రవీణ్ కుమార్ గౌడ్ ను ఇటీవల విధుల నుంచి తొలగించింది. భార్య పిల్లలతో అద్దె ఇంటిలో ఉంటున్న ప్రవీణ్ కుమార్ గౌడ్ కు కుటుంబ పోషణ భారం కావడంతో మనోవేదనకు గురై జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్న సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడని కౌడిపల్లి పోలీసులు తెలిపారు. మృతునికి భార్య సుమలతతో 16 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతునికి తల్లిదండ్రులతోపాటు అన్న, తమ్ముడు ఉన్నారు. మృతుని భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మురళి తెలిపారు.

Next Story