- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడుపాయల అటవీ ప్రాంతంలో యువకుడు ఆత్మహత్య..
by Batti.Sumithra |
మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సాధు సాయికుమార్ (25) ఏడుపాయల అటవీ ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

X
దిశ, పాపన్నపేట : మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సాధు సాయికుమార్ (25) ఏడుపాయల అటవీ ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సాదు అంతయ్య మంజుల కుమారుడు సాయికుమార్ ఏడుపాయల కమాన్ సమీపాన టెంట్ హౌస్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే ఇటీవల 28-03-2023 నుండి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గురువారం సాయికుమార్ మృతదేహం ఏడుపాయలు అటవీ ప్రాంతంలో లభ్యం అయింది. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
Next Story






