ఆర్థిక ఇబ్బందుల‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, లక్ష్మణచాంద : ఆర్థిక ఇబ్బందులతో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని ధ‌ర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ జీ. శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు..

ఆర్థిక ఇబ్బందుల‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ, లక్ష్మణచాంద : ఆర్థిక ఇబ్బందులతో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని ధ‌ర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ జీ. శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. ధర్మారం గ్రామానికి చెందిన వేముల నాగరాజు (36) బ్లేడ్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు. కొద్ది రోజుల నుంచి అతని బ్లేడ్ ట్రాక్టర్ సరిగ్గా నడవకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. శుక్రవారం ఉదయం పనికి వెళ్తానని వెళ్లిన నాగరాజు ధర్మారం గ్రామ శివారులో మల్లాపూర్ వెళ్లేదారిలో ఏదో గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. విపరీతంగా వాంతులు చేసుకోగా.. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం దేవేందర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి భార్య వేముల అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story