ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

ఆర్థిక ఇబ్బందుల‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న జగిత్యాల రూర‌ల్ మండ‌లం ల‌క్ష్మీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
X

దిశ, జగిత్యాల రూరల్ : ఆర్థిక ఇబ్బందుల‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న జగిత్యాల రూర‌ల్ మండ‌లం ల‌క్ష్మీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ల‌క్ష్మీపూర్ గ్రామానికి చెందిన మ‌హేష్ గ‌త కొంత కాలం క్రితం అప్పు చేసి ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ ఏర్పాటు చేశాడు. గిరాకీ స‌రిగ్గా లేక న‌ష్టాలు రావ‌డంతో ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ మానేసి కొద్ది రోజుల త‌రువాత మ‌ళ్లీ ప్రారంభించారు. ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ తో న‌ష్ట‌పోయాడు. అప్పులు ఎలా తీర్చాల‌నే ఆందోళ‌న‌తో అప్పుల భారాన్ని త‌ట్టుకోలేక మాన‌సికంగా కుంగిపోయిన మ‌హేష్ గ్రామ శివారులోని రైతు వేదిక స‌మీపంలో ఉన్న ఇనుప పైపున‌కు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృతుని భార్య జ‌మున ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story