- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
by Batti.Sumithra |
కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఆరుగొండ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

X
దిశ, రాజంపేట: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఆరుగొండ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, కుమ్మరి స్వామి (32) కు, అతని భార్యకు మధ్య కొన్ని రోజుల నుంచి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం కూడా ఇంట్లో గొడవ జరిగింది. ఇంట్లో నుంచి చేనులోకి వెళ్లిన మృతుడు రాత్రి పూట పురుగుల మందు తాగి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మృతిడికి భార్య, కూతురు ఉన్నారు.
Next Story






