- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
by Taduka Kalyani |
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ,:చేగుంట: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన మిక్కిలి భాస్కర్ రెడ్డి (33) కొన్నేళ్లుగా మనోహరాబాద్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. వ్యక్తిగత కుటుంబ సమస్యలు భార్య విడాకులు కోరుతున్న కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






