- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూరాల జలాశయంలో దూకి యువకుడి ఆత్మహత్య
జూరాల జలాశయంలో దూకి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జడ్చర్లకు చెందిన యువకుడు ప్రాజెక్టులోకి దూకడంతో స్థానికంగా కలకలం రేగింది.

దిశ, గద్వాల క్రైమ్ : జూరాల జలాశయంలో దూకి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జడ్చర్లకు చెందిన యువకుడు ప్రాజెక్టులోకి దూకడంతో స్థానికంగా కలకలం రేగింది. ధరూర్ ఎస్సై నందీకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల ప్రాంతానికి చెందిన చాణక్య (26) అనే యువకుడు హెటిరో ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్న చాణక్య, 51వ గేటు సమీపంలోని బ్యాక్ వాటర్ లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన జరిగిన ప్రదేశంలో మృతుడి ద్విచక్ర వాహనం పార్క్ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపులు
విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్సై నందీకర్ ఆదివారం ఉదయం తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మరియు స్థానిక జాలర్ల సాయంతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి గాలించినప్పటికీ, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. చాణక్య ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.






