VIDEO: నల్గొండ జిల్లాలో నడి రోడ్డుపై గంజాయి బ్యాచ్ వీరంగం..ఓ కుటుంబంపై దాడి

by Ajay Maddhiboyina |

తెలుగు రాష్ట్రాల‌లో గంజాయి బ్యాచ్ ఆగ‌డాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది యువ‌కులు గంజాయికి అల‌వాటుప‌డి జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు.

VIDEO: నల్గొండ జిల్లాలో నడి రోడ్డుపై గంజాయి బ్యాచ్ వీరంగం..ఓ కుటుంబంపై దాడి
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల‌లో గంజాయి బ్యాచ్ ఆగ‌డాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది యువ‌కులు గంజాయికి అల‌వాటుప‌డి జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. వాళ్ల జీవితాల‌ను నాశ‌నం చేసుకోవ‌డ‌మే కాక మ‌త్తులో దాడుల‌కు పాల్ప‌డుతూ ఇత‌రుల‌ను సైతం ఇబ్బంది పెడుతున్నారు. కొంద‌రు ఏకంగా దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా న‌ల్గొండ జిల్లాలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లా తిప్ప‌ర్తిలో చోటు చేసుకుంది.

తిప్ప‌ర్తిలో గంజాయి మ‌త్తులో రోడ్డుపై తిరుగుతూ యువ‌కులు వాహ‌నాల‌కు అడ్డు వ‌స్తున్నారు. ఆర్టీసీ బ‌స్సును ఆపి వారితో గొడ‌వ‌కు దిగారు. అంతేకాకుండా లారీని ఆపి సెల్ ఫోన్‌తో విసిరారు. అంతకు ముందు ఇదే బ్యాచ్ తిప్పర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో సంజీవరెడ్డి అనే వ్యక్తి కుటుంబంపై సైతం దాడి చేసినట్టు తెలుస్తోంది. గంజాయిమత్తులో యువకులు హల్‌చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. video

Next Story