బార్‌లో సినిమా షూటింగ్‌‌ను తలపించిన ఎటాక్.. యువకుడిపై బీర్ సీసాలతో దాడి

by Bhoopathi Nagaiah |

మంచిర్యాల జిల్లా (Manchryala District) బెల్లంపల్లి (Bellampally) కాల్ టేక్స్ బార్ అండ్ రెస్టారెంట్‌(Call Takes Bar and Restaurant)లో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో కొందరు వీరంగం సృష్టించారు.

బార్‌లో సినిమా షూటింగ్‌‌ను తలపించిన ఎటాక్.. యువకుడిపై బీర్ సీసాలతో దాడి
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా (Manchryala District) బెల్లంపల్లి (Bellampally) కాల్ టేక్స్ బార్ అండ్ రెస్టారెంట్‌(Call Takes Bar and Restaurant)లో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో కొందరు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై బీరు సీసా(Beer bottles)లతో దాడి చేసి బార్‌లో బీభత్సం సృష్టించడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ(Bellampally Two Town SI) మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన అల్లి సాగర్ అతని స్నేహితులు కాల్ టిక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఓ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవిస్తున్నారు. అదే బార్‌లో తాండూర్‌(Thandoor)కు చెందిన బండారి వంశీ కూడా అక్కడే మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో గొడవ జరిగింది. అల్లి సాగర్ ఆయన అనుచరులు బీర్ సీసాలు పగలగొట్టి బండారు వంశీ పై దాడి చేశారు. ఈ సంఘటనలో బండారి వంశీకి తీవ్ర గాయాలు గాయాలయ్యాయి. గాయపడిన ఆయనను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి(Bellampally Government Hospital)కి తరలించారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనను సృష్టించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story