ప్రేమకు అడ్డొచ్చిన కులం.. యువతి బలవన్మరణం

by Naga Rani Yarlagadda |

ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది.

ప్రేమకు అడ్డొచ్చిన కులం.. యువతి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో ఈ ఘటన జరిగింది. దిగువపల్లె పంచాయతీ మిట్టపల్లెకు చెందిన గంగరాజు కుమార్తె గౌతమి (23)బెంగళూరులో ఓ కంపెనీలు అకౌంటెంట్ గా పనిచేస్తోంది.

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుకుంటున్న సమయంలో తన తోటి విద్యార్థి, సోమల మండలం కందూరుకు చెందిన కార్తిక్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అతను కూడా ప్రస్తుతం బెంగళూరులోనే ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని గౌతమి అడిగింది.

ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నవంబర్ 22న ఇంటికి వెళ్లిన గౌతమి పేరెంట్స్ కు అసలు విషయం చెప్పింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌతమి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story