- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం..
by Taduka Kalyani |
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, ఉప్పల్: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాచారం పోలీస్లు తెలిపిన వివరాల ప్రకారం.. హేమనగర్, బోడుప్పల్ లో నివాసం ఉంటున్న బల్గరి గోవింద్ కూతురు మానస (23). ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ సెకండియర్ చదువుతుంది.
కాలేజీకి తన స్కూటీపై ఇంటి నుంచి వెళుతుండగా శ్రీకృష్ణ ఫార్మసీ, ఐడీఏ నాచారం వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న డీసీఎం వాటర్ ట్యాంకర్ అతి వేగంగా అజాగ్రత్తగా డ్రైవర్ నడుపుకుంటూ వచ్చి ఆమె స్కూటీని ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేస్తూ స్కూటీని డీ కొట్టడంతో మానస డీసీఎం వాటర్ ట్యాంకర్ టైరు కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మానస తండ్రి బల్గారి గోవింద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని నాచారం పోలీసులు తెలిపారు.
Next Story






