కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీ టెక్స్ టైల్స్ పార్క్ గ్రామంలో చోటు చేసుకుంది.

కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య
X

దిశ, తంగ‌ళ్ల‌ప‌ల్లి : కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీ టెక్స్ టైల్స్ పార్క్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గజ్జెల్లి శ్రీవల్లిక (20) అనే యువతి బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ చదువుతోంది. గత సంవత్సరం క్రితం మృతురాలికి కడుపు నొప్పి రాగా అపెండెక్స్ ఆపరేషన్ కూడా చేయించారు. అయినప్పటికీ కూడా 10 రోజుల క్రితం మళ్లీ కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించి మందులు వాడుతున్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పిని భరించలేక పోవడంతో పాటు తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి గజ్జెల్లి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story