యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య

by Bhoopathi Nagaiah |

యువకుడి వేధింపులతో మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య
X

దిశ, యాచారం : యువకుడి వేధింపులతో మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నందీశ్వర్ రెడ్డి, తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తమ్మలోని గూడ, గ్రామానికి చెందిన మస్కు యాదయ్య, మూడవ కుమార్తె (17) ఇంటర్ సెకండియర్ చదువుతూ ఇంటి వద్దనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన తోట్ల ప్రభాస్, గత ఆరు నెలలుగా ప్రేమించమని తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story