- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో గుర్తుతెలియని యువతి దారుణ హత్య
by Naga Rani Yarlagadda |
విశాఖపట్నం జిల్లాలో గుర్తు తెలియని యువతి దారుణహత్యకు గురైంది. దాకమర్రి ఫార్చ్యూన్ లేఔట్ సమీపంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం జిల్లాలో గుర్తు తెలియని యువతి దారుణహత్యకు గురైంది. దాకమర్రి ఫార్చ్యూన్ లేఔట్ సమీపంలో ఓ యువతి మృతదేహం సగం కాలిన స్థితిలో కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించి యువతి వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందని ప్రాథమికంగా నిర్థారించారు. నిందితులు యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టారని గుర్తించారు. మృతదేహం సగం కాలి ఉండటంతో మృతురాలి వివరాలు తెలియలేదని వెల్లడించారు. యువతిపై అత్యాచారం జరిగిందా? ఆమె ఎవరు? అనే వివరాలు పోస్టుమార్టమ్ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






