గుర్తుతెలియని వాహనం ఢీ.. యువతి, యువకుడు దుర్మరణం

by Yella Dhawani Reddy |

ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది.

గుర్తుతెలియని వాహనం ఢీ.. యువతి, యువకుడు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. సోమవారం మధురవాడ బస్టాండ్ వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఆనందపురం వైపు నుంచి విశాఖకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story