ప్రాణాలు తీస్తున్న పనిఒత్తిడి.. హైదరాబాద్‌లో యువ టెకీ ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

సాఫ్ట్ వేర్‌లో లక్షలకు లక్షలు జీతాలు ఉంటాయనేది ఎంత కామన్ గా వినిపిస్తుందో.. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనేది కూడా అంతే కామన్ గా వినిపిస్తుంది.

ప్రాణాలు తీస్తున్న పనిఒత్తిడి.. హైదరాబాద్‌లో యువ టెకీ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: సాఫ్ట్ వేర్‌లో లక్షలకు లక్షలు జీతాలు ఉంటాయనేది ఎంత కామన్ గా వినిపిస్తుందో.. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనేది కూడా అంతే కామన్ గా వినిపిస్తుంది. అందుకే చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి వ్యాపారాలు, వ్యవసాయం అంటూ ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరినవాళ్లకు, ఫ్రెషర్స్‌కు అయితే చుక్కలు చూపిస్తారని చెబుతుంటారు. ఇక వేరే ఆదాయమార్గాలు ఉన్నవాళ్లు అయితే ఆవైపు వెళతారు కానీ ఏ ఆదాయం లేనివాళ్లు, వ్యాపారం చేయడానికి పెట్టబడి లేనివాళ్లు ఉద్యోగం చేయక తప్పదు. ఈ క్రమంలో కొందరు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరం.

తాజాగా హైదరాబాద్ లోనూ ఓ యువ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన సతీష్ గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితమే అతడికి వివాహం కాగా ప్రస్తుతం సోదరుడితో కలిసి మియాపూర్ లోని బీకే ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నారు. ఇక సతీష్ భార్య ఇటీవల సంక్రాంతికి సొంతూరు వెళ్లగా ఇంకా తిరిగిరాలేదు. ఈ క్రమంలో సతీష్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పనిఒత్తిడి బరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు.

Next Story