- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా డెడ్ బాడీని కుక్కలకు వేయండి.. కన్నీళ్లు పెట్టించేలా యువకుడి సూసైడ్ లెటర్
ఏపీలోని నంద్యాల జిల్లా పొన్నాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు అతడు రాసిన సూసైడ్ నోట్ అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని నంద్యాల జిల్లా పొన్నాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు అతడు రాసిన సూసైడ్ నోట్ అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన చిరంజీవి అనే యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా యువకుడి ప్యాంట్ జేబులో దొరికిన సూసైడ్ నోట్ స్థానికులను కలిచివేసింది. జీవితంపై విరక్తితో, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నా అనే బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ చూస్తే అర్థం అవుతోంది.
సూసైడ్ నోట్ లో... నాకు సరైన ఇన్ కమ్ లేక తల్లిదండ్రులకు ఉపయోగపడలేకపోయాను. నా కోసం ఎవరూ బాధపడవద్దు. నా జీవితంలో ఏమీ సాధించలేకపోయాను. లక్షలు అప్పు చేసి నన్ను బతికించిన తల్లిదండ్రలకు భారం అయ్యాను. నా మృతదేహాన్ని వాళ్లకు ఇచ్చి ఇబ్బంది పెట్టకండి. కుక్కలకు గానీ చెత్తకుప్పలో కానీ పడేయండి. ఇదే నా చివరి కోరిక అంటూ చిరంజీవి పేర్కొన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఆళ్లగడ్డ మండలం పడకండ్లకు చెందిన మున్నెయ్యకు ముందు నలుగురు సంతానం కలిగి చనిపోయారు. ఐదో సంతానంగా జన్మించిన చిరంజీవి సైతం పుట్టుకతోనే అనారోగ్యంతో పుట్టాడు.
దీంతో కుమారుడిని లక్షలు ఖర్చు చేసి వైద్యం అందించి బతికించుకున్నారు. చదువుపూర్తి చేసిన చిరంజీవి నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుండి అతడు అనేక కష్టాలు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో యువకులు ఓ వయసు వచ్చిన తరవాత జీవితంలో సరిగ్గా స్థిరపడకపోతే ఎంతటి నరకం అనుభవిస్తారో తెలిపేలా ఈ లేఖ ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి స్నేహితులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాశులు ఎవరైనా తమ కుటుంబ సభ్యుల్లోని యువకులు డిప్రెషన్ లో ఉన్నట్టు కనిపిస్తే వారిని కూర్చోబెట్టి మాట్లాడాలని అంటున్నారు.






