- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతనికి 25 ఆమెకు 34.. కట్ చేస్తే ఆత్మహత్య !
ఇన్ స్టాగ్రామ్ లో ఏర్పడిన వారిద్దరి పరిచయం.. ఇద్దరు పిల్లల్ని అనాధలను చేసింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది.

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీని ఎంతవరకూ వాడాలో అంతవరకే వాడాలి. లేదంటే జీవితాలే చితికిపోతాయి. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో పరిచయాలు పెంచుకోవడం, దాన్నే ప్రేమనుకుని, కుటుంబాలను మర్చిపోయి ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. తీరా చూస్తే చివరికి చంపేయడాలు, లేదంటే చచ్చిపోవడాలు జరుగుతున్నాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగల్చగా.. ఇద్దరు పిల్లల్ని అనాధలను చేసింది. ఏలూరు జిల్లాలో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై, భర్త పిల్లలున్నా మరో యువకుడి మోజులో పడింది ఆ మహిళ. యర్రమళ్ల గ్రామానికి చెందిన 25 ఏళ్ల చిన మావుళ్లయ్యకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమ(34)తో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. రమకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నప్పటికీ, వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలియగానే వివాహిత కుటుంబ సభ్యులు వచ్చి గొడవ పడటంతో ఆమెను తిరిగి సొంత ఊరికి తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన వీరిద్దరూ కాలువలో దూకి తనువు చాలించారు.
మార్చి 24న రాత్రి చిన మావుళ్లయ్య తన అన్న కుమారుడికి ఫోన్ చేసి, రమ తన వద్దకు వచ్చిందని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి కాలువ గట్టున వారి వస్తువులు మాత్రమే కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, మంగళగిరి అగ్నిమాపక బృందాల గాలింపులో యువకుడి మృతదేహం బుధవారం రాత్రి లభ్యమవ్వగా, రమ కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కోసం గాలించగా.. చేబ్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కాలువ వద్ద ఆమె మృతదేహం గురువారం లభ్యమయింది. ఇన్ స్టాలో ఏర్పడిన పరిచయం, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక తల్లికి పుత్రశోకాన్ని మిగిలిస్తే, ఇద్దరు పసిపిల్లలను తల్లి లేని అనాథలను చేశాయి. ఈ ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది.






