Crime News : తాకరాని చోట తాకుతూ ఇబ్బంది పెడుతున్న యువకుడు... చివరకు ఆమెకు విసుగొచ్చీ....

by S Gopi |   (  Updated:2022-09-23 06:22:56  IST  )

కాబోయే భార్యను తాకరాని చోటు తాకుతూ ఇబ్బంది పెడుతున్నాడు. అయినా ఆమె ఓపికగా భరిస్తూ ఉంది. అయినా కూడా అతను ఆగకుండా అలా చేశాడు. ఆమె అందుకు....young man who took young woman out and behaved indecently ended up threatening her with extra dowry in MP

Crime News : తాకరాని చోట తాకుతూ ఇబ్బంది పెడుతున్న యువకుడు... చివరకు ఆమెకు విసుగొచ్చీ....
X

దిశ, వెబ్ డెస్క్: కాబోయే భార్యను తాకరాని చోటు తాకుతూ ఇబ్బంది పెడుతున్నాడు. అయినా ఆమె ఓపికగా భరిస్తూ ఉంది. అయినా కూడా అతను ఆగకుండా అలా చేశాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో అతను బెదిరింపులకు దిగాడు. తనకు అదనంగా మరో కారు, రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత కట్నం ఇవ్వలేమంటూ యువతి కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే, అతను పెళ్లి చేసుకోనంటూ ప్లేటు పిరాయించాడు. మోసపోయామని గ్రహించిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

గ్వాలియర్ లోని డీడీ నగర్ కు చెందిన ఓ యువతికి, బిర్లా నగర్ కు చెందిన యువకుడితో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో కట్నం కింద అతనికి రూ. 5 లక్షలు కూడా ఇచ్చారు. డిసెంబర్ లో వివాహం జరిపించేలా ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకున్నారు. అయితే, ఆ యువకుడు కాబోయే భార్యను చూసేందుకు పదే పదే ఆమె ఇంటికి వస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఆమెను తీసుకుని ఇటీవలే బయటకు వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో ఆమెను తాకరాని చోటు తాకుతూ ఇబ్బంది పెట్టాడు. అయినా కూడా ఆమె భరిస్తూ తనకు కాబోయే భర్తే కదా అనుకుని సహనంతో ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న అతను తనతో శారీరకంగా కలువాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపంతో తనకు అదనంగా కట్నం కావాలని, రూ. 5 లక్షలతోపాటు ఒక కారు ఇవ్వాలని అడిగాడు. అంత ఇచ్చుకోలేమంటూ ఆ యువతి కుటుంబ సభ్యులు చెప్పడంతో పెళ్లి చేసుకునేది లేదంటూ అతను ప్లేటు పిరాయించాడు. మోసపోయామని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.

Next Story