- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్చురీ నుంచి మహిళా శవాన్ని ఈడ్చుకెళ్లి అత్యాచారం (వీడియో)
మానవజాతే ఉలిక్కిపడే షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రాక్షసులు కూడా చేయనటువంటి నీచమైన పని ఓ ఆస్పత్రిలో జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్ : మానవజాతే ఉలిక్కిపడే షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రాక్షసులు సైతం సిగ్గుపడే నీచమైన పని ఓ ఆస్పత్రిలో జరిగింది. రక్తం తాగే క్రూర మృగాలు సైతం చేయని పనిని ఓ కామాంధుడు చేశాడు. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పోడిచే దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మార్చురీలో పోస్ట్ మార్టానికి తీసుకువచ్చిన ఓ మహిళ శవాన్ని ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశాడో యువకుడు. ఏడాదిన్నర తర్వాత సీసీ టీవీ ఫుటేజీతో ఈ ఘోరం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
బుర్హాన్‌పూర్ జిల్లా, ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మార్చురీకి 2024 ఏప్రిల్ 18న పోస్ట్‌మార్టానికి ఓ మహిళా మృతదేహం వచ్చింది. శవాన్ని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి వైద్యసిబ్బంది వెళ్లిపోయారు. అయితే నీలేష్ భిలాలా (25) అనే యువకుడు ఆస్పత్రికిలోకి చొరపడ్డాడు. ఆ తర్వాత మార్చురీలోకి ప్రవేశించి స్ట్రెచర్‌పై ఉన్న మహిళా శవాన్ని ఈడ్చుకుంటూ గోడచాటుకు లాక్కెళ్లాడు. అక్కడ మహిళా మృతదేహంపై అత్యాచారం చేశాడు. అయితే ఈ ఘటనను అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. కానీ రెండు రోజుల క్రితం ఆస్పత్రి సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుండగా సంవత్సరంన్నర క్రితం జరిగిన ఈ దారుణ అత్యాచారం ఘటన వెలుగుచూసింది. షాక్‌కు గురైన వైద్యసిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన కాప్స్.. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించి ఇవాళ అరెస్ట్ చేశారు.
అయితే నీలేష్ భిలాలా మార్చురిలోకి ఎలా ప్రవేశించాడు..? ఇదే మొదటిసారినా లేక గతంలో కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం తేలనున్నాయి. ప్రస్తుతం ఈ అత్యాచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






