యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్

by Naga Rani Yarlagadda |

మెదక్ జిల్లాలో మరో యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడి అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్ లైన్ బెట్టింగ్ (Online Betting) అనేకమంది ప్రాణాలను బలిగొంటోంది. అత్యాశకు పోయి బెట్టింగ్ కు పాల్పడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. యువత మాత్రం పెడదారిలోనే వెళ్తున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో మరో యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడి అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన దిలీప్ కుమార్ (29) పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటుపడిన అతను.. సుమారు రూ.2 లక్షలు నష్టపోయాడు. పైగా అప్పులు కూడా పెరిగిపోయాయి. వాటిని తీర్చలేక ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. గోసముద్రం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దిలీప్ మృతదేహాన్ని వెలికి తీసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story