- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడదెబ్బ తగిలి యువకుడు మృతి..
by Taduka Kalyani |
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శాంతినగర్ గ్యారేజ్ ఏరియా కి చెందిన బండవరం ప్రశాంత్ (30) ఎండ దెబ్బ తగలడంతో ఇంట్లోనే మృతి చెందాడు.

X
దిశ, మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శాంతినగర్ గ్యారేజ్ ఏరియా కి చెందిన బండవరం ప్రశాంత్ (30) ఎండ దెబ్బ తగలడంతో ఇంట్లోనే మృతి చెందాడు. మృతుడు ప్రశాంత్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. పిల్లలు ఇద్దరు చిన్నారులు కావడంతో ఈ ఘటన చూసినవారందరూ కన్నీటి పర్యంతమయ్యారు . మృతుడు మందమర్రి మండలం మామిడిగూడెం( లంబాడి తండ) గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారి గా ఉన్నాడు. మృతుని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రశాంత్ ఆకస్మిక మృతి బంధువులు, స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story






