కాసేపట్లో పెళ్లి.. రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

by Naga Rani Yarlagadda |

కొద్దిసేపటిలో సోదరి పెళ్లి జరగాల్సి ఉండగా.. రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి చెందడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది.

కాసేపట్లో పెళ్లి.. రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో పెళ్లివేడుకతో ఆనందోత్సాహాలు వెల్లివిరియాల్సిన ఇంట.. రోడ్డుప్రమాదం విషాద ఛాయల్ని నింపింది. పెళ్లి ఏర్పాట్లను చూసుకుని ఇంటికి వస్తున్న యువకుడు రోడ్డుప్రమాదంలో మరణించాడు. ఈ విషాదఘటన ఉమ్మడి విజయనగరం జిల్లా మరుపల్లి గ్రామం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనుంజయ నాయుడు (23) పెదనాన్న కూతురి వివాహం శుక్రవారం (మార్చి 6) విజయనగరంలో జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లను చూసేందుకు ధనుంజయ మరో ముగ్గురితో కలిసి యజమానాపురం నుంచి విజయనగరానికి కారులో వెళ్లి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో మరుపల్లి గ్రామం వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం ధనుంజయనాయుడు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేసి.. ఆపై విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. కొద్దిగంటల్లో పెళ్లివేడుకతో ఆనందంతో వెల్లివిరియాల్సిన ఇంట.. యువకుడి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.

Next Story