ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య..

by Disha Web Desk 11 |
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య..
X

దిశ, శంషాబాద్: ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం చేశారని మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్వాల్ గూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ కొత్వాల్ గూడకు చెందిన ఆటో డ్రైవర్ సిద్ధాంతి శివ (23), మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఆటోను ఇంటి నుంచి తీసుకెళ్లి చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో అతని తండ్రి సిద్ధాంతి చంద్రయ్య ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా బుధవారం మధ్యాహ్నం కొత్వాల్ గూడ శివారు ప్రాంతంలోని చెన్నమ్మ హోటల్ పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని సిద్ధాంతి శివ (23) మృతి చెందాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ మృతుడు శివ కొత్వాల్ గూడ లోనే యువతిని ప్రేమించాడని ఆ యువతికి మరో యువకుడితో పెండ్లి కుదిరి నిశ్చితార్థం కావడంతో మనస్థాపానికి గురైన శివ ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed