చెల్లెళ్ల చదువుతో పోల్చుకుని మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య

by Taduka Kalyani |

తన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు చేస్తుండగా, తాను చదువు మధ్యలోనే ఆపేసి ఖాళీగా ఉండిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్షెట్టిపేటలో చోటుచేసుకుంది.

చెల్లెళ్ల చదువుతో పోల్చుకుని మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య
X

దిశ, లక్షెట్టిపేట: తన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు చేస్తుండగా, తాను చదువు మధ్యలోనే ఆపేసి ఖాళీగా ఉండిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్షెట్టిపేటలో చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సీఎస్ఐ చర్చి రోడ్డుకు చెందిన మద్దెల వివేక్ (24) డిగ్రీ చదువును మధ్యలోనే నిలిపివేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన ఇద్దరు చెల్లెళ్లు బాగా చదువుకొని ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుండగా, తాను మాత్రం ఏమీ సాధించలేకపోయాననే ఆవేదనతో జూన్ 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంటలకు ఉపయోగించే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తండ్రి కమలాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story