ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యాయత్నం

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-03-10 11:41:19  IST  )

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో ప్రేమ వ్యవహారం విషాదానికి దారితీసింది. ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదిత్య అనే యువకుడు కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవల వారి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఆదిత్య ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. సోమవారం గ్రామంలోనే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, గమనించిన గ్రామస్తులు వెంటనే అడ్డుకుని అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story