- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"నా బంగారం లేని లోకంలో నేను బతకలేను".. లెటర్ రాసి యువకుడి ఆత్మహత్య
by Ajay Maddhiboyina |
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందని నిన్న యువతి ఆత్మహత్య చేసుకోగా తను లేని లోకంలో నేను ఉండలేను అంటూ నేడు ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందని నిన్న యువతి ఆత్మహత్య చేసుకోగా తను లేని లోకంలో నేను ఉండలేను అంటూ నేడు ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని పాతకొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని హిత వర్షిణి నిన్న హైదరాబాద్ లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా ప్రేయసి మరణవార్త తట్టుకోలేక నేడు కొమ్ముగూడెం గ్రామంలోని తన ఇంట్లో వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నా బంగారుతల్లి లేని లోకంలో నేను ఉండలేను, మనల్ని ఎవరూ విడదీయలేరు. వచ్చే జన్మలో కలుసుకుందాం.. అంటూ ఆత్మహత్యకు ముందు వినయ్ సూసైడ్ లెటర్ రాశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story






