- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హగ్ ఇస్తావా..? ముద్దు ఇస్తావా..? కామంతో రెచ్చిపోయిన పొలిటికల్ లీడర్
‘‘ హగ్గిస్తావా..? లేదంటే ముద్దిస్తావా? ఏదో ఒకటి ఇవ్వాల్సిందే.. ఇస్తేనే నువ్వు ఇక్కడి నుంచి కదిలేది’’ అంటూ ఓ పార్టీకి చెందిన కొత్తగూడెం నాయకుడు ఒకరు ఓ వివాహిత పట్ల అసభ్యంగా, తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.

ప్లీజ్.. ఏదో ఒకటి ఇవ్వు..
‘‘ హగ్గిస్తావా..? లేదంటే ముద్దిస్తావా? ఏదో ఒకటి ఇవ్వాల్సిందే.. ఇస్తేనే నువ్వు ఇక్కడి నుంచి కదిలేది’’ అంటూ ఓ పార్టీకి చెందిన కొత్తగూడెం నాయకుడు ఒకరు ఓ వివాహిత పట్ల అసభ్యంగా, తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అతగాని చేష్టలకు భయపడిన బాధితురాలు తెలిసినవాళ్లకు ఫోన్ చేసి అక్కడికి రప్పించుకుని భయంతో వెళ్లిపోయింది. కొద్ది రోజులుగా ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తున్నట్లు, ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. త్వరలో ఫోన్ రికార్డింగ్స్‌తో కలిపి అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ‘దిశ’కు వెల్లడించింది.
దిశ బ్యూరో, ఖమ్మం / దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కొత్తగూడెం కేంద్రంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించడం విస్మయానికి గురి చేస్తోంది. పది మందికి ఆదర్శంగా ఉండి రాజకీయాలు చేయాల్సిన ఆయన మహిళ పట్ల తన వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. కూతురి వయసున్న వివాహితతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. తరుచూ ఫోన్ చేసి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడు. గత కొంత కాలంగా మౌనంగా భరించిన ఆ వివాహిత.. ఒంటరిగా ఓ కార్యాలయంలో ఉన్న సమయంలో చేయి పట్టి గుంజి హగ్గిస్తావా? లేదంటే ముద్దిస్తావా? అంటూ బరితెగించాడు. దీంతో భయపడిన ఆ వివాహిత తేరుకుని తెలిసినవాళ్లకు ఫోన్ చేసి తాను ఉన్న కార్యాలయం అడ్రస్ చెప్పి అక్కడినుంచి తప్పించుకుంది. తర్వాత అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇంతవరకు జరిగిన ఫోన్ సంభాషణలకు అన్నీ రికార్డింగ్ చేసిన ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.
కొంతకాలంగా ఫోన్ లో మాటలు కలిపి..
రుణాలు ఇప్పిస్తానని మహిళలకు మాయమాటలు చెప్పే ఇతగాని వ్యవహారశైలి తెలియక జిల్లా కేంద్రానికి చెందిన ఓ వివాహిత రుణం కోసం ఈ నాయకున్ని సంప్రదించింది. తప్పకుండా ఇప్పిస్తానని, ఇంకా ఎవరన్న మహిళలు ఉంటే వారికి కూడా ఇప్పిస్తానని తనకు పరిచయం చేయాలని కోరడంతో అనుమానం వచ్చి అప్పటినుంచి అతనికి దూరంగానే ఉండసాగింది. ఫోన్ నెంబర్ తీసుకున్న అతగాడు.. కొద్ది కాలంగా ఫోన్ చేస్తూ ట్రాప్ చేయాలని చూస్తున్నాడు. మొదట కుటుంబ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్న నాయకుడు.. చివరకు బ్రాండెడ్ బట్టలు హైదరాబాద్ నుంచి తెచ్చానని, ఇంటికి వచ్చి ఇస్తానని చెప్పడంతో విస్తుపోయిన బాధితురాలు వద్దని తిరస్కరించింది. మరోసారి స్వీట్ పాన్ తీసుకున్నానని ఎక్కడున్నావో చెబితే తెచ్చి ఇస్తానని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నా ఇన్ స్టా గ్రాం యూజర్ ఐడీ, పాస్ వార్డు నీకు మెస్సేజ్ చేస్తా. ఓపెన్ చేసి చూడు. పొలిటికల్ గా ఉన్న కదా.. పెద్ద పెద్ద నాయకులతో దిగిన ఫొటోలు అందులో ఉంటాయి. నాకు అనేక మంది పెద్ద నాయకులతో పరిచయం ఉంది. నీ ఇన్ స్టా అడ్రస్ చెప్పవా.. ఎలా ఓపెన్ చేయాలో చెప్పవా’ అంటూ వేధించసాగాడు. 58 ఏండ్ల వయసులో కూడా ఇతనిగాని చేష్టలకు అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రుణాల పేరిట మహిళలకు వల..
పేదలు, మధ్యతరగతి వారికి లోన్లు ఇప్పిస్తానని, తాను ఓ కేంద్ర ప్రభుత్వ పథకానికి కన్వీనర్ ను అని మాయమాటలు చెబుతూ తన ఇంటినే ఆఫీసుగా మార్చుకుని లక్ష రూపాయల వరకు రుణం ఇప్పిస్తానంటూ చెబుతాడు. అప్లై చేయాలని 400 నుంచి 1000 రూపాయలు తీసుకుని రుణం వచ్చాక రూ.5వేలు వసూలు చేస్తుంటాడు. సాధారణంగా ఈ రుణం పొందాలంటే మీ సేవా కేంద్రంలో రూ. 50 కూడా చేసుకోవచ్చు. కానీ మహిళల ఆసరా, అమాయకత్వం ఇతగాని బుట్టలో వేసే తత్వం వరంగా మారాయి. అప్లై చేసే సమయంలో తీసుకున్న నంబర్లకు ఫోన్ చేసి మహిళలతో రుణం విషయం మాట్లాడి చిన్నగా ముగ్గులోకి దింపడం ఇతని నైజం. అంతేకాదు.. ఫోన్ చేయడంతో పాటు ఆకర్శనీయమైన కొటేషన్లు మహిళలకు పంపడం.. నేనున్నానంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ తర్వాతే ఇతని అసలు స్వరూపం బహిర్గతం చేస్తుంటాడు. ఇప్పటికే ఇతని వలలో అనేక మంది మహిళలు చిక్కి ఇబ్బందులు పడినట్లు కొత్తగూడెంలో టాక్ నడుస్తుంది.
పెద్దపెద్ద నాయకులతో పరిచయాలున్నాయి..
పార్టీలో తాను ఎంత చెబితే అంతేనని, పెద్ద పెద్ద నాయకులతో తనకు పరిచయాలున్నాయని, అందరూ తనకు చాలా సన్నిహితంగా ఉంటారని మహిళలకు చెబుతూ.. రుణాలు ఇప్పించడంలో కీలకం తానే అని చెబుతుంటాడు. కోటి రూపాయల వరకు సబ్సిడీ లోన్లు కూడా ఇప్పిస్తానని, రూ.50 లక్షలు వాడుకుని మిగతా రూ.50 లక్షలు సబ్సిడీ పోతుందని అమాయక మహిళలను మోసం చేయడంలో ఘనాపాటిగా ఆరితేరాడు. ప్రస్తుతానికి పార్టీలో ఏ పదవి లేకున్నా తనకు తానే పదవులు క్రియేట్ చేసుకుని ఇతర నాయకులతో దిగిన ఫొటోలు చూపిస్తూ ఆ ఫొటోలను మహిళలకు పంపిస్తూ తన గొప్పలు నిరూపించుకునే ప్రయత్నం చేసి మహిళలను బురిడీ కొట్టించేస్తున్నాడు.
పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనున్న బాధితులు..
ఫోన్లలో ఆరాలుతీసి, ప్రలోభాలకు గురిచేసి ఒక్కసారిగా బరితెగించి వివాహితపై అనుచితంగా ప్రవర్తించిన నాయకుడి తీరుపై ఆరా తీయగా అనేక విషయాలు వెలుగుచూశాయి. గతంలో కూడా ఇలాగే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించేవాడని, తన ట్రాప్‌లో పడేసేందుకు చేయని ప్రయత్నం లేదని కొందరు బాధిత మహిళలు తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఘటనతో బాధితురాలు మరికొందరు మహిళలను ఆరా తీయడంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. త్వరలో వీరందరూ పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఆ నాయకునిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.






