అమరచింతలో దారుణం.. యువకుడి దారుణ హత్య..?

by Taduka Kalyani |

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో దారుణం జరిగింది.

అమరచింతలో దారుణం.. యువకుడి దారుణ హత్య..?
X

దిశ, అమరచింత: వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో దారుణం జరిగింది. పట్టణానికి చెందిన ఆనంద్ (19) అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఎవరికీ ఆనంద్ కనిపించ లేదు. మరుసటి రోజు మంగళవారం ఉదయం స్నేహితులకు అనుమానం వచ్చి అమరచింత శివారులోని ఆనంద్ పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఆనంద్ పొలంలో విగతజీవిగా కనిపించాడు. దీంతో స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడిని ఎవరో అతి కిరాతకంగా కొట్టి హత్య చేసి చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆత్మకూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Next Story