- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి పేరిట గిరిజన మహిళల అక్రమ రవాణా.. పోలీసులు చెక్ మేట్..
పేద గిరిజన మహిళలను పెళ్లి పేరుతో మోసగించి ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్న ముఠా పై ఆసిఫాబాద్ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది.

దిశ, ఆసిఫాబాద్: పేద గిరిజన మహిళలను పెళ్లి పేరుతో మోసగించి ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్న ముఠా పై ఆసిఫాబాద్ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడారు.
అయా మారుమూల గ్రామాల్లోని పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి ప్రేమ, పెళ్లి పేరుతో మభ్యపెట్టి వారిని అక్రమంగా తరలిస్తున్న ముఠా రెండు కేసుల్లో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. వీరిలో ఒకరు కానిస్టేబుల్ హరిదాస్ కూడా ఉండగా, అతనిని విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. పరారీలో ఉన్న ఇద్దరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
మహిళల మిస్సింగ్ కేసులపై విచారణను ముమ్మరం చేసినట్టు పేర్కొన్న ఏఎస్పీ, "పెళ్లి పేరుతో ఎవరైనా మభ్యపెట్టి ఇబ్బందులు కలిగిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాధిత మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలి," అని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






