- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15ఏళ్లుగా సంతానం కోసం గొడవ.. మహిళ ఆత్మహత్య..
రాజస్థాన్ జైపూర్‌లోని మీనా పల్డి ప్రాంతానికి చెందిన మమతా అనే మహిళకు 15ఏళ్ల క్రితం వడ్రంగి అయిన ముఖేష్ జంగిద్‌తో పెళ్లి జరిగింది. కానీ ఇన్నాళ్లు అయిన ఇద్దరు సంతానం పొందలేకపోయారు. దీంతో వీరిమధ్య తరుచూ గొడవలు జరిగేవి.

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ జైపూర్‌లోని మీనా పల్డి ప్రాంతానికి చెందిన మమతా అనే మహిళకు 15ఏళ్ల క్రితం వడ్రంగి అయిన ముఖేష్ జంగిద్‌తో పెళ్లి జరిగింది. కానీ ఇన్నాళ్లు అయిన ఇద్దరు సంతానం పొందలేకపోయారు. దీంతో వీరిమధ్య తరుచూ గొడవలు జరిగేవి. తాజాగా కూడా ఇలాంటిదే గొడవ జరగ్గా.. సీరియస్‌గా తీసుకున్న ఆమె ఆత్మహత్య చేసుకుంది. కోపం, ఒత్తిడితో మహిళ తన గదిలోకి వెళ్లి చేయి కోసుకుంది. దీని కారణంగా రక్తం కారుతుండగానే.. మళ్లీ చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.
అయితే కుటుంబ సభ్యులు ఏదో విషయంలో ఆమెను కలిసేందుకు వెళ్లారు. కానీ తలుపు తట్టినా ఆమె నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో.. ఏదో జరుగుతుందని భయపడ్డారు. ఎలాగోలా డోర్ ఓపెన్ చేస్తే.. గదిలో ఈ సీన్ కనిపించింది. మమత ఫ్యాన్‌కు వేలాడుతుండగా.. చేతి నుంచి రక్తం పోతూనే ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






