- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతపురం జిల్లాలో ఘోరం.. కొడుకు గొంతు కోసి, ఆపై!
అనంతపురం జిల్లా కేంద్రం శారదనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కుమారుడి గొంతు కోసి ఆపై మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగిరి మండలంలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం అమూల్యతో వివాహం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కేంద్రం శారదనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కుమారుడి గొంతు కోసి ఆపై మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగిరి మండలంలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం అమూల్యతో వివాహం జరిగింది. కాగా కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య కలహాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భర్త ఉదయం డ్యూటీకి వెళ్లగా తిరిగి వచ్చేసరికి ఘోరం జరిగింది. అమూల్య తన కుమారుడి గొంతుకోసి హత్య చేసి తరవాత ఫ్యాన్ కు ఉరి వేసుకుని తాను సైతం ఆత్మహత్యకు పాల్పడింది.
డ్యూటీ నుండి తిరిగి వచ్చిన భర్త కిటికీలో నుండి చూడగా భార్య ఫ్యాన్ కు వేళాడుతుండటం చూసి షాక్ అయ్యాడు. చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు తెరవగా మంచంపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరు అయ్యాడు. కుటుంబ కలహాలతోనే కొడుకు గొంతుకోసి ఆపై అమూల్య ఉరివేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. అమ్మలు లేదా నాన్నలు ఎవరో ఒకరు పిల్లల ప్రాణాలు తీసి ఆపై వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. పెద్దవాళ్లు తప్పు చేసి తరవాత అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు.






